సుప్రసిద్ధ బాలీవుడ్ గాయకుడు కెకె (కృష్ణకుమార్ కున్నత్) 53 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.నజ్రుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన అనంతరం హోటల్‌కు చేరుకున్న కేకే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అని సమాచారం. వెంటనే ఆయనని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కోల్‌కతాకు రెండు రోజుల పర్యటనలో ఉన్న కెకె సోమవారం సాయంత్రం కూడా కళాశాల నిర్వహించిన సంగీత కచేరీలో నజ్రుల్ మంచ్‌లో ప్రదర్శన ఇచ్చారు.కృష్ణకుమార్ కున్నాత్ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, అస్సామీ మరియు గుజరాతీ భాషా సినిమాలో పాటలు పాడారు.