నేడు హీరో నిఖిల్ సిద్దార్థ్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయన నటిస్తున్న కార్తికేయ 2 మూవీ నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. సముద్రం దాచుకున్న ప్రపంచంలోని అతిపెద్ద రహస్యం... ఈ ద్వారకా నగరం... అని నిఖిల్ చెప్పే డైలాగ్ సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక మోషన్ పోస్టర్ ఎలా ఉందంటే... సముద్రం నడి మధ్యలో ఒక పడవలో వెళ్తున్న నిఖిల్, అనుపమ, కమెడియన్ శ్రీనివాస్ దేనినో చూసి ఒకింత షాక్ కు గురైనట్టు కనిపిస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగర రహస్యాన్ని కనుక్కునేందుకు నడుం బిగించిన హీరో తుదకు ఆ రహస్యాన్ని ఛేదించగలిగాడా? అనే ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా వ్యాప్తంగా 22, జూలై విడుదలకాబోతుంది.
నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కబోతుంది కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.