హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం మాచర్ల నియూజకవర్గం. MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 8వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ విడుదల తేదీని ఆగస్టు 12కు మేకర్స్ మార్చారు.
నిన్న హైదరాబాద్ లో జరిగిన విక్రమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేతుల మీదుగా మాచర్ల నియోజకవర్గం సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటకు కృష్ణ చైతన్య సాహిత్యం అందించగా, నాకాష్ అజీజ్, సంజన కల్మాన్జే ఆలపించారు. ఈ పాటలో నితిన్ స్టైలిష్ డాన్స్ మూవ్మెంట్స్ తో, అల్ట్రా మోడరన్ స్టైల్ లో కేథరిన్ మెరుపులు యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. బీచ్ కార్నివాల్ లో సాగే పెప్పీ సాంగ్ గా ఛిల్ మారో పాట ఛార్ట్ బస్టర్ గా నిలవడం ఖాయం.