టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జయాపజయాలతో సంబంధం లేకుండా వరస సినిమాలను చేస్తున్నారు. తొలి సినిమా రాజావారు రాణిగారు సినిమాతో ఫరవాలేదనిపించిన కిరణ్, ఆ తర్వాత చేసిన SR కళ్యాణమండపం తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. రీసెంట్గా విడుదలైన సెబాస్టియన్ పీసీ తో భారీ డిజాస్టర్ను చవిచూసిన కిరణ్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టులున్నాయి. చాందిని చౌదరితో కిరణ్ కలిసి నటించిన సమ్మతమే మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటికి టైటిల్స్ ను ఖరారు చెయ్యలేదు. అందులో ఒక సినిమాకు సంబంధించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ చిత్రసీమలో షికారు చేస్తుంది.
కొత్త దర్శకుడు రమేష్ కదిరి డైరెక్షన్లో, మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఒక చిత్రంలో కిరణ్ హీరోగా నటిస్తున్నారు. అతుల్య రవి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఒక మాస్ సాంగ్ ను చిత్రీకరించడానికి మేకర్స్ లక్షల్లో ఖర్చు పెట్టి మరీ ఒక భారీ సెట్టింగును నిర్మించారు. రామోజీ ఫిలిం సిటీలో నిర్మించబడిన ఈ సెట్ లో కిరణ్, అతుల్య లపై ఒక పెప్పీ అండ్ మాస్ సాంగ్ ను చిత్రీకరించనున్నారట. ఈ సెట్ ఖరీదు దాదాపు కోటి రూపాయలని ప్రచారం జరుగుతుంది. ఒక కుర్ర హీరో సినిమాకు ఇంత ఖరీదైన సెట్ నిర్మించారంటే, ఈ సినిమాపై నిర్మాతల నమ్మకం ఎంతలా ఉందొ చుడండి.