బాల దర్శకత్వంలో సూర్య ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా సూర్యకి తన కెరీర్లో 41 వ సినిమా. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం సూర్య గోవాలో మరో వారం రోజుల్లో సెట్స్‌లో జాయిన్ కానున్నాడు. ఇందులో సూర్య రెండు పాత్రల్లో నటించనున్నాడని టాక్, టీమ్ ఇప్పటికే కన్యాకుమారి మరియు హిందూ మహాసముద్రంలో ఎక్కువ భాగం చిత్రీకరించింది.'సూర్య 41' కోసం బాలా రెండు పవర్‌ఫుల్ టైటిల్స్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో అధికారికంగా టైటిల్‌ని ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు ప్రకటించనున్నారు. ఈ సినిమాకి జివిపి సంగీతం అందిస్తున్నారు.