వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో పూర్తి వినోదభరిత చిత్రంగా తెరక్కుతున్న చిత్రం "అంటే సుందరానికి". ఇందులో నాచురల్ స్టార్ నాని, నజ్రియా నాజిమ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్రబృందం తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ పై సూపర్ అప్డేట్ ఇచ్చింది. జూన్ 2వ తేదీన వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్సిటీ లోని CR కాన్వకేషన్ హల్ లో, సాయంత్రం ఐదు గంటల నుండి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వివేక్ సాగర్ సంగీతమందించిన ఈ చిత్రం జూన్ 10వ తేదీన విడుదల కానుంది. గతేడాది శ్యామ్ సింగ రాయ్ గా గంభీరమైన పాత్ర పోషించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాని ఈ సినిమాలో పూర్తి ఫన్ లుక్ లో కనిపించి ఏమేరకు ప్రేక్షకులకు నవ్వులు పంచుతాడో చూడాలి.