"నిర్ణయం" మూవీ నుంచి ‘హలో గురూ ప్రేమ కోసమే..’ పాట లిరిక్స్:
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ ఈ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం…
ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని, ఆర్ని
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం…
మగాడితో ఆడదానికేలా పౌరుశం…
ఉంగరాల జుట్టు వాన్ని… ఒడ్డు పొడుగు ఉన్న వాన్ని
చదువు సంధ్య కలిగినోన్ని… చౌక భేరమా
గొప్ప ఇంటి కుర్రవాన్ని… అక్కినేని అంతటోన్ని
కోరి నిన్ను కోరుకుంటే… పెద్ద నేరమా
నా కన్నా నీకున్న… తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు… నీకన్నా మోరమ్మా, ఆఆ
నేనంటే కాదన్న… లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే… మొనగాడు ఎవడమ్మా
ఐ లవ్ యు డార్లింగ్… బికాజ్ యు ఆర్ చార్మింగ్
ఎలాగొలా నువ్వు దక్కితే… లక్కు చిక్కినట్టే, వై నాట్
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం…
మగాడితో ఆడదానికేలా పౌరుశం…
ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని, య య
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం…
కట్టుకుంటే నిన్నే తప్ప… కట్టుకోనే కట్టుకోను
ఒట్టు పెట్టుకుంటినమ్మా… బెట్టు చేయకే
అల్లిబిల్లి గారడీలు… చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు… మల్లె తీగలా
నీ చేతే పాడిస్తా… లవ్ సాంగు డ్యూయెట్లు
నా చేత్తో తినిపిస్తా… మన పెళ్ళి బొబ్బట్లు
ఆహా నా పెళ్ళంటా… ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ… అందాల జంటంటా
అచ్చా మైనే ప్యార్ కియా… లుచ్చా కమ్ నహీ కియా
అమి తుమి తేలకుంటే… నిను లేవదిస్కుపోతా, ఆర్ యు రడీ
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం…
ప్రేమించాను దీన్నే… కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే… పొందలేని వాన్ని, హ హా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుశం…