రచయితగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు కథలనందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్. ప్రస్తుతం తన తనయుడి ఆస్థాన రచయిత పదవిలో ఉంటూ, జక్కన్న బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలను తీర్చి దిద్దడంలో కీలక పాత్రను పోషించారు. దీంతో విజయేంద్ర ప్రసాద్ అంటే అందరికి గౌరవం పెరిగిపోయింది. విజయేంద్ర ప్రసాద్ ప్రాముఖ్యత బాలీవుడ్ వరకు పాకిపోయింది. సల్మాన్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన భజరంగీ భాయిజాన్ కథను అందించింది కూడా విజయేంద్ర ప్రసాదే. తాజాగా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారట. ఈ విషయాన్ని బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీనే స్వయంగా మీడియాకి తెలిపారు. నిన్న వైజాగ్ లో జరిగిన ప్రెస్ మీట్లో అయాన్ మాట్లాడుతూ... బ్రహ్మాస్త్ర స్క్రీనింగ్ ను తొలిసారి విజయేంద్ర ప్రసాద్ కు చూపించామని తెలిపారు. రణ్ బీర్ మాట్లాడుతూ... సినిమా చూసిన తర్వాత విజయేంద్ర ప్రసాద్ సూచించిన కొన్ని మార్పులకు అయాన్ ఎంతో గౌరవమిచ్చి, ఒక నాలుగురోజుల పాటు మూవీ లో కొన్ని సీన్స్ ను రీషూట్ చేశారని చెప్పారు.