పూర్ణ.. శ్రీమహాలక్ష్మి అనే సినిమాతో 2007లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా, 2011లో వచ్చిన సీమటపాకాయ్ సినిమాతో పూర్ణ తెలుగులో గ్రాండ్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత అవును, లడ్డుబాబు, నువ్వలా నేనిలా, అవును 2 వంటి చిత్రాలలో నటించినప్పటికీ పూర్ణకు తగిన గుర్తింపు రాలేదు. ఈ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ ప్రోగ్రాం ద్వారా పూర్ణ తన క్రేజును పెంచుకుంది. పూర్ణ యాక్టరే కాదు ప్రొఫెషనల్ క్లాసికల్ డాన్సర్ కూడా.
తాజాగా ఆమె తన అభిమానులందరికి షాక్ ఇస్తూ ఉన్నపళంగా తన నిశ్చితార్ధం జరిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూర్ణ కాబోయేవాడిని పరిచయం చేయడంతో అభిమానులు, సన్నిహితులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ మరియు సీఈఓ, కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి ఐన అసిఫ్ అలీని పూర్ణ త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. మరి పెళ్లి తర్వాత పూర్ణ సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.