మనసుకు హత్తుకునే ఎన్నో ప్రేమకథలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన దిగ్గజ నిర్మాత ఎమ్మెస్ రాజు. ఈ మధ్య కాలంలో సినిమాలను నిర్మించడం కన్నా రాజుగారి ఫోకస్ మొత్తం డైరెక్షన్ మీదనే ఉంది. డైరెక్టర్ గా మారి చేసిన తొలి చిత్రం డర్టీ హరి హిట్టవ్వడంతో రాజుగారు 7డేస్ 6 నైట్స్ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకులను పలకరించనున్నారు. రాజుగారి తనయుడు సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్ జంటగా నటిస్తుండగా, రోహన్, కృతిక శెట్టి మరో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సుమంత్ అశ్విన్ మరియు రజినీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 24వ తేదీన ఈ సినిమాను విడుదలచెయ్యబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ రన్ టైం పై ఆసక్తికర విషయమొకటి బయటకి వచ్చింది. ధియేటర్ సీట్లలో నుండి ప్రేక్షకుడిని లేవనీయకుండా అంటే బ్రేక్/ఇంటర్వెల్ లేకుండా సినిమాను రన్ చేద్దామనుకుంటున్నారట. ఈ సినిమా రన్ టైం కూడా పెద్దగా గంటలు,గంటలు లేదు. కేవలం గంటా యాభై నిముషాలు కావడంతో రాజుగారు అలాంటి ఆలోచన చేసారు. అయితే, ధియేటర్ల యాజమాన్యాలు ఇంటర్వెల్ లో క్యాంటీన్ బిజినెస్ కు అంతరాయం కలిగించొద్దని రాజుగారిని కోరితే, వారి బిజినెస్ ను అర్ధం చేసుకుని రాజు సినిమాకు పదినిముషాల బ్రేక్ ఇచ్చారు. గంటా యాభై నిమిషాల సినిమాకు పది నిమిషాల బ్రేక్ కలుపుకుని ఈ సినిమా రన్ టైం మొత్తం రెండు గంటలు.