టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ ఫిలిం విరాటపర్వం. టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ గతేడాదిలోనే పూర్తయింది. 1990లలో తెలంగాణ లో జరిగిన నక్సలైట్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో విడుదలకావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. జూన్ 17న సినిమాను విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
విడుదలకు ఇంకా రెండు వారాల సమయముండటంతో చిత్రబృందం ప్రొమోషన్ కార్యక్రమాలకు ముహూర్తం పెట్టింది. ఒక పాటతో ఈ ప్రమోషన్స్ ప్రారంభించాలని భావించిన దర్శకుడు నగా దారిలో అనే లిరికల్ సాంగ్ తో విరాటపర్వం ప్రచార కార్యక్రమాలు జరుగుతాయని ట్వీట్ చేసారు. ఆ పాటను జూన్ 2వ తేదీన ముహూర్తం పెట్టినట్టు తెలిపారు.