కోలీవుడ్ సీనియర్ హీరో కమల్ హాసన్ నటిస్తున్న కొత్త చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందించారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో జూన్ 3వ తేదీన విడుదలకాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్లో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. హీరో నితిన్ సొంత ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ట్ మూవీస్ విక్రమ్ మూవీ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుక్కుంది. ఈ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో కమల్ మాట్లాడుతూ... 40ఏళ్ళ కింద ఏఎన్నార్ గారి శ్రీమంతుడు సినిమా సందర్భగా తొలిసారి హైదరాబాద్ కు వచ్చినప్పట్టి విశేషాలను నెమరు వేసుకున్నారు. తన సినిమాలను ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు చేసినందుకు తెలుగు ఆడియన్స్ కు కృతజ్ఞతలను తెలియచేసారు. ఈ సందర్భంగా నటుడిగా తనకు సంపూర్ణ రూపమిచ్చిన కే. బాలచందర్ గారిని కమల్ గుర్తు తెచుకున్నారు. అనిరుద్ మాట్లాడుతుంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ గుర్తుకు వస్తారని, నాలానే లోకేష్ కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడని చెప్పారు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ తనకు సోదరుల్లాంటి వారన్నారు. ఇంతటి ఇంటర్నేషనల్ ట్యాలెంట్ పెట్టుకున్న సౌత్ సినీ ఇండస్ట్రీ పాన్ ఇండియా సినిమాలకే ఆగిపోకుండా పాన్ వరల్డ్ సినిమాలను తెరకెక్కించాలని కమల్ కోరుకున్నారు. విక్రమ్ సినిమా తప్పకుండ విజయం సాధిస్తుందని కమల్ నమ్మకం గా ఉన్నారు.