టాలెంటెడ్ అండ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి "మత్తు వదలారా" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో "దొంగలున్నారు జాగ్రత్త" అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ దొంగలున్నారు జాగ్రత షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యినట్లు ప్రకటించారు. తెలుగులో మొట్టమొదటి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని కూడా ప్రకటించారు. కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ అండ్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.