టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియన్ మూవీ "మేజర్" తో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున "మేజర్" చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. "మేజర్" చిత్రం భారతదేశంలోని ముంబైలో 26-11 మధ్య జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా జూన్ 3, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఇప్పుడు స్పెషల్ ప్రీమియర్లను వీక్షించిన ప్రేక్షకుల నుండి ఈ చిత్రానికి విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ జూన్ 2, 2022న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మరిన్ని ప్రీమియర్ షోలను ఏర్పాటు చేయాలని మేజర్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మూవీ మేకర్స్ నుండి రావాల్సి ఉంది. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ,మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.