బైక్ యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా తన తదుపరి సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఆంధ్రాలోని మారుమూల గ్రామానికి వచ్చే ఇంజనీర్‌గా ఆ గ్రామంలో జరిగిన అనుమానాస్పద మరణాల వెనుక కథను తెలుసుకోవడానికి వచ్చిన ఇంజనీర్‌గా కనిపించనున్నారు అని లేటెస్ట్ టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. బివిఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.