నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరంతో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ కోటి రూపాయలతో ఒక స్పెషల్ సెట్‌ను నిర్మించినట్లు సమాచారం. రమేష్ కడూరి దర్శకత్వంలో మేకర్స్ కిరణ్ అబ్బవరం మరియు హీరోయిన్ అతుల్య రవిపై ఒక మాస్ డ్యూయెట్‌ను చిత్రీకరించనున్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో ఈ స్పెషల్ సెట్ ని నిర్మించగా ఈ పాటకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. బాలాజీ లిరిక్స్ అందించగా, భాను మాస్టర్ కొరియోగ్రఫీని చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.