హీరోయిన్లు యాక్షన్ లోకి దిగడం. రౌడీల బొక్కలు ఇరగొట్టడం చాలా అరుదు. చాలా తక్కువ మందికి ఈ అవకాశం దక్కుతుంది. ఇప్పుడీ.. ఈ అవకాశం పూజా హెగ్డ్ దక్కినట్లు తెలుస్తోంది. ఆమె యాక్షన్ లోకి దిగను న్నారు. ఇందుకోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నారు. టైగర్ రిలీజ్ కాకముందే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబోలో మరో పాన్ ఇండియా సినిమా 'జనగణమన' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా పూజా హెగ్డ్ ను తీసుకున్నారు. ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న తొలి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నారట. ఈ యాక్షన్ సీన్స్ లో విజయ్ తో కలిసి పూజా ఫైట్ చేయనుందట. ఇందుకోసం ముందస్తు శిక్షణ తీసుకుంటుంది.. బుట్టబొమ్మ. మరోవైపు, హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న 'భవధీయుడు భగత్ సింగ్' నుంచి పూజా తప్పు కుందనే వార్తలు వినిపిస్తున్నాయి.