పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుండి రాబోతున్న మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో శృతి హాసన్ కథానాయిక. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ఎప్పుడో స్టార్ట్ అయినా పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా ఇప్పటికి కేవలం 30శాతం మాత్రమే పూర్తయింది.
ప్రశాంత్ నీల్,ప్రభాస్ కమిట్మెంట్స్ నుండి ఫ్రీ అవడంతో సలార్ కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రభాస్ తో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్ ను ప్లాన్ చేసిన ప్రశాంత్, డార్లింగ్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇవ్వనున్నాడని అర్ధమవుతుంది. ఇదిలావుంటే, అవ్వకవ్వక స్టార్ట్ ఐన సలార్ షూటింగ్ సడెన్గా ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ కావాలని ఆపేశారని అంటున్నారు. ఎందుకంటే, ప్రశాంత్, ప్రభాస్ ను ఈ సినిమాలో చాలా ఫిట్ గా, సరికొత్త లుక్ లో చూపించాలనుకుంటున్నాడట. మరి ప్రభాసేమో కొన్నాళ్ల నుండి బరువు విషయంలో పడుతున్న ఇబ్బందులు అందరికి తెలిసిందే. ప్రశాంత్ కోరిక మేరకు ఫిజిక్ మీద దృష్టి పెట్టిన ప్రభాస్ ప్రస్తుతం జిమ్ లో కఠిన వ్యాయామాలు చేస్తున్నాడట. ప్రభాస్ బరువు తగ్గి, సలార్ కు తగ్గ రూపంలో తయారైన తర్వాతే షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని తెలుస్తుంది.