కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ది వారియర్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో రామ్ సరసన కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. DSP సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవల విడుదలైన బుల్లెట్ సాంగ్ కు యువత నుండి విశేష స్పందన వచ్చింది. చాలా మంది యువతీయువకులు ఈ పాటకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మరో పాటను రిలీజ్ చెయ్యటానికి చిత్రబృందం ముహూర్తం ఖరారు చేసారు. ఈ నెల నాల్గవ తేదీన మధ్యాహ్నం 12:07 గంటలకు దడ దడ అనే పాటను రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలిపే ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.