SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ అన్నిచోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబటింది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20, 2022న విడుదలైంది. తాజా అప్డేట్ ప్రకారం, 'RRR' సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ ని రివీల్ చేసి ప్రకటించారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.