తన సహజ నటనతో అనతికాలంలోనే ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న హీరో నాని. మొదటి నుండి వైవిధ్యతకు పెద్ద పీట వేస్తూ వచ్చాడు. అలానే మంచి విజయాలు సాధించాడు. కానీ ఆ మధ్య మూసధోరణి లో సాగే మాస్ మసాలా సినిమాలను చేసి విమర్శకుల నుండి, అభిమానుల నుండి నెగిటివిటీని తెచ్చుకున్నాడు. తిరిగి తన ఓన్ స్టైల్ లోనే సినిమాలు చెయ్యడం మొదలెట్టిన నాని శ్యామ్ సింగ రాయ్ వంటి క్లాసికల్ హిట్ ను అందుకున్నాడు.
నాని కొత్తగా నటించిన చిత్రం అంటే సుందరానికి. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో సోషల్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో నజ్రియా హీరోయిన్ గా నటించింది. వివేక్ సాగర్ సంగీతమందించారు. కొంచెం సేపటి క్రితమే ట్రైలర్ రిలీజయింది. హిందూ-క్రిస్టియన్ వివాహం అనే సున్నితమైన సామాజిక అంశంపై జనాలను ఎడ్యుకేట్ చేసే విధంగా సినిమా ఉండనుందని తెలుస్తుంది. నాని తన అద్భుతమైన నటనతో మళ్ళీ ప్రేక్షకుల నుండి మార్కులు కొట్టేసాడు. నజ్రియా కూడా తన నటనతో ఆకట్టుకుంటుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే యువతీయువకులు తమ కుటుంబంలో ఎదుర్కొనే పరిస్థితులను సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు తెలుస్తుంది. జూన్ 10వ తేదీన సినిమా థియేటర్లలో విడుదల కానుంది.