సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారువారిపాట చిత్రంతో, ఇప్పటివరకు గుడ్ గర్ల్ ఇమేజ్ ఉన్న కీర్తి ఒక్కసారిగా గ్లామర్ డాల్ గా మారిపోయింది. ఇకపై మాస్ మసాలా మూవీస్ లో గ్లామర్ పాత్రలను చెయ్యటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా, కీర్తి సర్కారువారిపాటలో ఒకరేంజులో రెచ్చిపోయింది. మ మ మహేష్ సాంగ్ లో కీర్తి డ్రెస్సులు, మాస్ స్టెప్స్ చేస్తే ఈ విషయం బాగా అర్ధమవుతుంది. ఇటీవలే ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ కు మురారివా అనే పాటను జోడించారు. ముందుగా యూట్యూబులో రిలీజ్ చేస్తామని చెప్పారు కానీ, చివరికి థియేటర్లో రిలీజవ్వటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నిజానికి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. జానపద నేపథ్యంలో మాస్ సాంగ్ లా ఉంటుందనుకున్న మురారివా పాట తెరపై మెలోడియస్ గా స్లో గా సాగుతుంది. సెకండాఫ్ లో వచ్చే ఈ పాట ఆడియన్స్ ను నీరసపడేలా చేసింది. ఈ పాట ప్లేస్ లో మ మ మహేష్ లాంటి మంచి ఊపున్న పాటను పెట్టి పరశురామ్ మంచి పని చేసాడని చాలామంది అభిప్రాయం. మురారివా పాట థియేటర్లో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఇష్టపడకపోవచ్చు కానీ, ఈ పాటలో కీర్తి సురేష్ దేవకన్యలా ఎంతో అందంగా కనిపించి సినిమాపై ఇంటరెస్ట్ ను తీసుకొస్తుంది. కీర్తి సురేష్ ఏంజెల్ డ్రెస్సులు, ఆమె గ్లామర్, హాట్ నెస్ మహేష్ ను సైతం వెనక్కి నెట్టేస్తున్నాయి. మహేష్ కూడా ఈ పాటలో క్లాస్ స్టెప్స్ ను వేసాడు కానీ, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా కీర్తి నే నిలిచిందని అనుకుంటున్నారు.