బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ , జయబాధురి ల వివాహబంధానికి నేటితో 49 ఏళ్ళు పూర్తయ్యాయి. జూన్ 3, 1973 లో అమితాబ్, జయ ల పెళ్లి జరిగింది. ఈ మేరకు తమ 49వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ అమితాబ్ సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోను పోస్ట్ చేశారు. అమితాబ్ పోస్ట్ చేసిన ఫొటోలో అమితాబ్ బంగారు రంగు షేర్వాణీలో మెరిసిపోతుంటే, జయ సాంప్రదాయ ఎరుపురంగు దుస్తుల్లో సిగ్గులమొగ్గలవుతున్నారు. ఇన్నాళ్ళుగా తమ పై ప్రేమాభిమానాలను కురిపిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు, సన్నిహితులకు అమితాబ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిఒక్కరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నందుకు సారి చెప్పారు.
"గుద్ది" అనే సినిమాలో అమితాబ్, జయ ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరిద్దరూ కలిసి జంజీర్, అభిమాన్, సిల్సిలా, చుప్ప్కే చుప్ప్కే, మిలి, షోలే, కభీ ఖుషి కభీ గమ్ చిత్రాల్లో నటించారు.