సౌత్ ఇండియా టాప్ యాక్ట్రెస్ లో సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే ఒక్కరు. ఈ స్టార్ బ్యూటీ ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య వంటి భారీ చిత్రాలలో నటించింది. పూజా ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉంది. బాలీవుడ్‌లో పూజా స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో 'కబీ ఈద్ కబీ దీపావళి' మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. రణవీర్ సింగ్‌తో ఆమె నటించిన 'సర్కస్' చిత్రం జూలై 15, 2022న గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు-త్రివిక్రమ్ ల సినిమాలో కనిపించనుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'భవధీయుడు భగత్ సింగ్' లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రొమాన్స్ చేయనుంది. అంతేకాకుండా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న 'జన గణ మన' మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.