పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం చోర్ బజార్. గెహన సిప్పి కధానాయిక. దళం,జార్జ్ రెడ్డి వంటి చిత్రాలతో విమర్శకుల మన్ననలను పొందిన జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐవి ప్రొడక్షన్స్ పతాకంపై బీఏ రాజు నిర్మిస్తున్నారు. "రొమాంటిక్" సినిమాతో తొలి హిట్ అందుకున్న ఆకాష్ ఆ విజయాన్ని ఈ సినిమాతో కొనసాగించాలనుకుంటున్నాడు. ఈ సినిమాతో సీనియర్ నటి, జాతీయ పురస్కార గ్రహీత ఊర్వశి అర్చన గారు సెకండ్ ఇన్నింగ్సును స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతమందించారు. తాజాగా ఈ సినిమా నుండి నూనూగు మీసాల అనే లిరికల్ సాంగ్ రిలీజయ్యింది. క్రేజీ హీరోయిన్ సమంత ఈ పాటను విడుదల చేసారు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ గీతంగా, ఎంతో మెలోడియస్ గా ఉంది. ఆకాష్ పూరీ, గెహన సిప్పి ల జంట స్క్రీన్ పై చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, లక్ష్మి మేఘన ఆలపించారు.