ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విరాటపర్వం జూన్ 17 వ థియేటర్లకు రాబోతుంటే, జూన్ 5వ తేదీన ట్రైలర్ రాబోతున్నట్టు కొంచెం సేపటి క్రితమే చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. విరాట పర్వం చిత్రంలో టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ గతేడాదిలోనే పూర్తయింది. 1990లలో తెలంగాణ లో జరిగిన నక్సలైట్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కింది.
ట్రైలర్ ను జూన్ 5న రిలీజ్ చెయ్యబోతున్నట్టు తెలిపే పోస్టర్ ఇంటరెస్టింగ్ గా ఉంది. ఈ పోస్టర్ లో రానా సాయి పల్లవిని తన గుండెలకు హత్తుకుంటాడు. ఆమెను హత్తుకున్న చేత్తోనే తుపాకిని కూడా పట్టుకుంటారు. అంటే..., రానా పాత్రలో నెగిటివ్ ఛాయలు ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా జూన్ 17 న రిలీజ్ కాబోతుంది.