బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ తన భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో వెల్లడించింది. మొదట అన్నింటికన్నా ముఖ్యమైనది నమ్మకమని.. ఆ తర్వాతే విషయాలపై అవగాహన, విధేయత, గౌరవం, సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను ఆశిస్తానని చెప్పింది. అలాగే ఎప్పుడైనా మంచి మనసున్న వాడినే ప్రేమిస్తానని, చిన్న చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూసేవాళ్లంటే అస్సలు నచ్చదని పేర్కొంది. ఇక వివాహ బంధంలో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అని, అహాన్ని దరిచేరనివ్వకుంటేనే నూరేళ్లపాటు హెల్త్ రిలేషన్షప్ కొనసాగుతుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ సిదార్ మలో తాతో డేటింగ్ ఉందని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తుండగా... అతన్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందం టున్నారు ఫ్యాన్స్,