మిస్ ఇండియా ఈషా గుపా.. సీనియర్ యాక్టర్ బాబీ డియోల్లో ఇంటిమేట్ సీన్లపై ఓపెన్ అయింది. వీరిద్దరూ కలిసి నటించిన ‘ఆశ్రమ్ 3' వెబ్ సిరీస్ శుక్రవారం విడుదలైన సందరంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. బాబితో సన్నిహిత సన్నివేశాల్లో నటించడాన్ని పెద్ద సమస్యగా ఫీల్ అవలేదని, ఇవి ప్రేక్షకులను మెప్పించగలవనే నమ్ముతున్నట్లుగా చెప్పింది. ఇండస్ట్రీలో దశాబ్ద కాలంగా ఉంటున్న నటులు ఎంతో పరిణతి చెంది ఉంటారని, వారితో బోల్డ్ సీన్స్ షూట్ చేస్తున్నపుడు ఎలాంటి ఇబ్బంది కలగదని తెలిపింది. కామోద్రేకాన్ని రెచ్చగొట్టే సన్నివేశాలు తెరకె క్కించినప్పటికీ అందులో ఎవరి సొంత ప్రయోజనాలూ ఉండవని.. ప్రేక్షకులను ఆనందపరిచేందుకే కష్టపడతామని స్పష్టం చేసింది. చివరగా ఇది జనాలకు మంచిదైనా, చెడదైనా సరే తాను మాత్రం తెలివైన పనిగానే ఫీల్ అవుతానన్న ఈషా.. జీవితాంతం మంచి, చెడు మనతోనే తిరుగుతుంటాయని, జనాల మాటలకు కొత్తగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెప్పింది. ఇక ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్లో ప్రీమియర్‌గా ప్రదర్శించబ డుతుంది.