విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 3’ సినిమా ఈ నెల 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను రాబట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో ఈ సినిమా 52.01 కోట్ల షేర్ రాబట్టగా, 94.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.అయితే ఈ సినిమా త్వరలోనే 100 కోట్ల గ్రాస్‌ను అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫుల్ రన్‌లో ఈ సినిమా ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్‌గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.