వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ "విరాట పర్వం". ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది... అయితే తాజాగా థియేట్రికల్ రిలీజ్ ఖరారు అయ్యింది. మే 5న ఎదురుచూస్తున్న ట్రైలర్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు మరియు ఇప్పుడు ట్రైలర్ లాంచ్ కోసం వేదికను ధృవీకరించారు. రేపు మే 5న కర్నూలులో గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అక్కడి అభిమానులకు ఆసక్తికర వీడియోతో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో రానా సరసన యంగ్ అండ్ టాలెంటెడ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.