ప్రస్తుత కాలంలో సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ భారీ రేంజులో జరుగుతున్నాయి. అలానే విడుదల తర్వాత కూడా తమ సినిమాను ప్రమోట్ చేస్తూ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించటానికి ఆయా చిత్రబృందాలు తెగ కష్టపడుతున్నాయి. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఒంటిచేత్తో సర్కారువారిపాట ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ చేసారు. విడుదల తర్వాత కూడా ప్రమోషన్స్ చేసారు. ఈ మేరకు SVP మాస్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సూపర్ స్టార్ డాన్స్ వెయ్యటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏదో ఒకటి చేసి సినిమా పై ప్రేక్షకులకు ఇంటరెస్ట్ వచ్చేలా చెయ్యాలి.., వారిని థియేటర్లకు రప్పించాలి.. ఇదే దర్శకనిర్మాతల టార్గెట్. ఇప్పుడిదే ఫార్ములాతో ఎఫ్ 3 బృందం కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ ను భారీ రేంజులో చేస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, వెంకటేష్, వరుణ్ తేజ్ లు పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో ఎంతో చురుగ్గా పాల్గొంటూ, మరింతమంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఒక ఈవెంట్ కు స్టార్ కమెడియన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం గారిని రప్పించారు. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మానందం గారిని హోస్ట్ గా మార్చి ఎఫ్ 3 చిత్రబృందం చేసిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. థియేటర్లకు విక్రమ్, మేజర్ లాంటి కొత్త చిత్రాల రాకతో బ్రహ్మానందం తో ఎఫ్ 3 చిత్రబృందం చేసిన ప్రమోషన్స్ ఏమేరకు మూవీకి ప్లస్ అవుతాయో చూడాలి.