కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటెర్నేషనల్ ఫిలిమ్స్ లో నిర్మింపబడిన చిత్రం విక్రమ్. ఇందులో కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటించారు. కార్తీ ని ఖైదీలా చూపించిన లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాకు దర్శకుడు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. హీరో సూర్య అతిధి పాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ నిన్న థియేటర్లలో విడుదలైన విక్రమ్ చిత్రానికి తొలిషోతోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇదిలా ఉండగా, విక్రమ్ సినిమా డిజిటల్ ఎంట్రీపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విక్రమ్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి హాట్ స్టార్, శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ కొనుక్కున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పటి ట్రెండ్ ప్రకారం, థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఆయా సినిమాలు ఓటిటిలో ప్రత్యక్షమవుతుండటంతో విక్రమ్ మూవీ డిజిటల్ ఎంట్రీ కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. జూలై మొదటి వారంలో విక్రమ్ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.