స్టార్ ఇమేజ్ ఉండి, చేతిలో సొంత ప్రొడక్షన్ హౌజ్ ఉన్నాకానీ ఆడంబరాలకు, ఈగోలకు పోకుండా రానా చిన్న సినిమాలో నటించడానికైనా సిద్దపడతాడు. అంత సింప్లిసిటి ఆయన సొంతం. పెద్దింటి నుండి వచ్చి సినిమాల్లో విలన్ వేషాలు ఈ రోజుల్లో వేసేవారెవరున్నారు చెప్పండి. జోగేంద్ర లాంటి పవర్ ఫుల్ హీరో పాత్రలో నటించాలన్నా, భళ్ళాలదేవుడిలా విలనిజాన్ని చూపించాలన్న ఒక్క రానా వల్లే అవుతుంది. అనుష్క లీడ్ రోల్ చేసిన రుద్రమదేవి లో రానా నటించి అనుష్కకు ఎంతో సపోర్ట్ గా నిలిచాడు. తాజాగా విరాటపర్వం సినిమాలో సాయి పల్లవి కూడా అలానే సపోర్ట్ చేస్తున్నాడు. మొదటినుండి విరాట పర్వం చిత్రం నుండి సాయి పల్లవికి సంబంధించిన పోస్టర్లు, థీమ్ సాంగ్., ప్రమోషన్స్ లో కూడా ఆమె పోస్టర్లనే వాడటం.. చూసిన కొంతమంది నెటిజన్లు రానాను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సొంత బ్యానర్ అయ్యుండి, విరాటపర్వం లో మీకన్నా సాయి పల్లవికి, మూవీ కాన్సెప్ట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ ముఖాన్ని చూపించటానికి కూడా చిత్రబృందం ఇష్టపడకపోవడం దరిద్రం. బయటివాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూడటంలో తప్పేముంది? అని ఒక నెటిజన్ ట్వీట్ చేసాడు. ఇందుకు రానా అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. హీరో తగ్గి హీరోయిన్ ను ఎలివేట్ చేస్తే ఆ కిక్కే వేరు బ్రదర్.. సొంత బ్యానర్ కాబట్టే ఇలాంటి గొప్ప పనులు జరిగాయి. మీ స్పందనకు అభినందనలు అని రానా ఆ నెటిజన్ కు సమాధానమిచ్చారు. రానా చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏ హీరో అయినా, తనను కాదని హీరోయిన్ ను ఎలివేట్ చేయటం ఇష్టపడడు. అసలు ఇలాంటి ప్రసక్తే స్టార్ హీరోల విషయంలో జరగదు. తనను తాను తగ్గించుకుని, హీరోయిన్ ను, స్టోరీని ఎలివేట్ చెయ్యటం నిజంగా రానా చేసిన గొప్ప పని అని కొంతమంది నెటిజన్లు ఆయనను అభినందిస్తున్నారు.