కొరటాల శివ డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆచార్య చిత్రం థియేటర్లలో అలా విడుదలైందో లేదో.., ఇలా మెగాస్టార్ చిరంజీవి విదేశాలకు చెక్కేశారు. ఆచార్య బాక్సాఫీస్ పరిస్థితేంటో కూడా తెలుసుకోకుండా చిరు ఇలా వెకేషన్ కెళ్ళడం చర్చనీయాంశమైంది. అమెరికా, యూకే లలో నెలపాటు సుదీర్ఘ పర్యటనలు జరిపిన తర్వాత చిరు రీసెంట్గానే ఇండియాకు తిరిగొచ్చారు.
కెరీర్లో చెరగని మచ్చలా మారిన ఆచార్య గురించి చిరు ఇప్పుడైనా ఏమన్నా మాట్లాడతారా? ఆచార్య లోటుపాట్ల గురించి చర్చిస్తారా? అభిమానులకు సంజాయిషీ ఇస్తారా? ఆచార్య డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితేంటి?...ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు చిరు సమాధానం చెప్పవలసి ఉంది. చిరు కెరీర్లో భారీ డిజాస్టర్లుగా నమోదైన రిక్షావోడు, బిగ్ బాస్, SP పరశురామ్ తర్వాత అంతటి ఘోర పరాజయమైన ఆచార్య పై చిరు స్పందన ఎలా ఉంటుందన్నది అంతటా ఆసక్తిగా మారింది.
ఆచార్య విషయం పక్కన పెడితే, చిరు చేతి నిండా సినిమాలున్నాయి. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరన్న, భోళా శంకర్ సినిమాల షూటింగులు చిరు పూర్తి చేయవలసి ఉంది. చిరు నుండి ఆపై వచ్చే ప్రాజెక్టుల మీద కూడా ఆచార్య ఎఫెక్ట్ ఏమి ఉండదనే చెప్పాలి. కాకపోతే, ఆచార్యలా డిజాస్టర్ లా కాకుండా ఉండాలని ఆయా డైరెక్టర్లకు చిరు కండీషన్లు పెడుతున్నారట. మోహన్ గాంధీ డైరక్షన్లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ షూటింగ్ అంతిమ దశకు వచ్చేసింది. మిగిలిన షూటింగ్ ను కూడా చిరు పూర్తి చేసేస్తే ఈ ఏడాదిలోనే ఆ సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.