కొన్నిరకాల కాంబినేషన్స్ మనం కల్లో కూడా ఊహించుకోలేం. ఆ కాంబినేషన్స్ ను తెరపై చూడాలంటే రెండు కళ్ళు చాలవు. రామ్ చరణ్, జూనియర్ - ఎన్టీఆర్ ల అద్భుతమైన కాంబినేషన్ నే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో చూపించి జనాల చేత జేజేలు కొట్టించుకున్నాడు. అలాంటి ఒక కళ్ళు చెదిరే కాంబినేషన్, ఇండియన్ బాక్సాఫీస్ వెన్నులో వణుకు పుట్టించే కాంబినేషన్ ఒకటుంది. అదే బాహుబలి ప్రభాస్ - కేజీఎఫ్ రాఖీభాయ్. వీరిద్దరిని ఒకే స్క్రీన్ పై చూస్తే ఎలా ఉంటుంది? గూజ్ బంప్స్ వచ్చేస్తాయి కదా. అయినా వీరిద్దరెందుకు కలుస్తారు? అని అనుకుంటున్నారు కదా. వీరిని సృష్టించిన క్రియేటర్ పుట్టినరోజు అయితే వీరిద్దరూ కలవకుండా ఉంటారా? చెప్పండి.
ఈ రోజు ప్రశాంత్ నీల్ బర్త్ డే. ఈ సందర్భంగా కేజీఎఫ్, సలార్ చిత్రాల నిర్మాత విజయ్ కిరంగదుర్ నిన్న రాత్రి బెంగుళూరులో గ్రాండ్ పార్టీని ఎరేంజ్ చేసాడు. నిన్న సాయంత్రం బెంగుళూరుకు హైదరాబాద్ నుండి ఫ్లైట్ లో వెళ్లిన బాహుబలి ప్రభాస్, అక్కడ రాఖీభాయ్ ను కలవటం జరిగింది. విజయ్ కిరంగదుర్, ప్రశాంత్ నీల్, ప్రభాస్, యష్ లు కలిసి కెమెరాలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ను, యష్ ను కలిసి చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ వీరిద్దరి కాంబోలో సినిమా తీస్తే బావుణ్ణని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చూద్దాం...ఫ్యూచర్ లో అలాంటిదేమైనా జరుగుతుందేమో!