నందమూరి నటసింహం బాలకృష్ణ, స్క్రీన్ పై ఎంతో పవర్ ఫుల్ గా నటించి అశేష ప్రేక్షక జనాలను తన అభిమానులుగా మార్చుకున్నారు. బాలయ్య పబ్లిక్ లో తన వైల్డ్ బిహేవియర్ వల్ల పలుమార్లు ట్రోలింగ్ కు గురయ్యారు. అభిమానులను కొట్టటం, అరవటం, ఫోన్లు విసిరెయ్యటం లాంటి వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. బాలయ్యకు సంబంధించిన అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
రాము అనే అభిమాని కొత్తింటి గృహప్రవేశానికి బాలకృష్ణ హాజరయ్యారు. గృహప్రవేశ కార్యక్రమం అయిపోగానే, తనను చూడటానికి పోటెత్తిన జనాలు, అభిమానులతో బాలకృష్ణ ఫోటోలు దిగటం ఆరంభించాడు. ఈ క్రమంలో ఒక అభిమాని చంటి పిల్లను ఎత్తుకుని బాలయ్యతో ఫోటో దిగాలని వస్తాడు. గాఢంగా నిద్రపోతున్న ఆ పాప ను బాలయ్య తట్టిలేపి కెమెరా వంక చూడమని చెప్తాడు. దీంతో అక్కడున్న వారందరూ ఫక్కున నవ్వుతారు. ఏయ్..ఏయ్ లెగు అని నిద్రపోతున్న పాపని బాలయ్య అరవటం తో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఎక్కడైనా, ఎప్పుడైనా బాలయ్య తనలానే ఉంటారని కొంతమంది బాలయ్యను మెచ్చుకుంటుంటే, చిన్న పిల్లను కొట్టి నిద్ర లేపాల్సిన అవసరమేముందని మరి కొంతమంది బాలయ్యను నిందిస్తున్నారు. అభిమాని ఆప్యాయంగా పిలిస్తే, తన బిజీ షెడ్యూల్ ని సైతం పక్కన పెట్టి బాలయ్య ఈవెంట్ కు హాజరయ్యారు. జనాలు ఈ విషయాన్ని వదిలేసి చిన్న పిల్లను కొట్టాడంటూ ఆ వీడియోను వైరల్ చెయ్యటం నిజంగా విచిత్రంగా ఉంది.