విడుదలకు ముందే, ప్రీమియర్ షోలతో దేశవ్యాప్త సంచలనంగా మారిన అడివిశేష్ మేజర్ చిత్రం నిన్న ధియేటర్లకొచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మేజర్ చిత్రబృందాన్ని తెగ పొగిడేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా విమర్శకులందరు మేజర్ చిత్రానికి పాజిటివ్ రివ్యూలను ఇవ్వడం విశేషం.
మేజర్ మూవీ తొలిరోజు వసూళ్ల లెక్కలతో ఆశ్చర్యపోయిన శేష్ ఇలా ట్వీట్ చేసాడు. ఇప్పటి వరకు నా కెరీర్లో వచ్చిన సినిమాలకు 5 రెట్లు ఎక్కువగా మేజర్ కలెక్షన్లున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సపోర్ట్ ఈ సినిమాకు యాభై శాతం కలిసొస్తే, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్పిరిట్ సినిమా విజయానికి వందశాతం కృషి చేసింది... అంటూ ట్వీట్ చేసాడు. తొలి రోజు మేజర్ కు రూ. 4.10 కోట్ల షేర్, ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అమెరికాలో మేజర్ చిత్రం గురువారం రూ. 2.10 కోట్లు, శుక్రవారం $207k కలెక్షన్లు సాధించింది. హిందీ బెల్టులో మేజర్ చిత్రం ఎంత కొల్లగొట్టిందన్నది ఇంకా తెలియాల్సి ఉంది.