నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం "అంటే సుందరానికి" గురించి అందరికి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా తెలుగు సినిమాలో నటించడం ఇదే తొలిసారి. ఇటీవల వచ్చిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చి ఇప్పుడు సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి మునుపటిలా క్లీన్ యు సర్టిఫికేట్ అందించారు.
మరి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి థియేటర్లలో ఎలాంటి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుందో చూడాలి. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.