ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమా ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎఫ్ 2 లో కీలకపాత్రలు పోషించిన నటీనటులందరూ ఎఫ్ 3 లో కూడా నటించారు. అయితే ఈ సారి తన డైరెక్షన్లో రాబోయే ఎఫ్ 4 లో మాత్రం అలా ఉండదని అనిల్ తెలిపారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఎఫ్ 4 లో మరో కొత్త హీరో జాయిన్ అవుతారని, ఎఫ్ 2, ఎఫ్ 3 లో నటించిన తమన్నా, మెహ్రీన్ లు ఎఫ్ 4 నటించరని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు. ప్రమోషన్స్ లో పాలుపంచుకోని తమన్నా గురించి అనిల్ మాట్లాడుతూ... ఎఫ్ 3 షూట్ టైం లో తామిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని, రెండు మూడు రోజులు మాట్లాడుకోలేదని, ఇప్పుడు అంతా సర్దుమణిగిందని చెప్పారు. గొడవెందుకయిందో కూడా అనిల్ తెలిపారు. ఎఫ్ 3 సినిమాలో ఒకరి కన్నా ఎక్కువ మందితో కాంబినేషన్ సీన్లు ఉంటాయి. ఈ క్రమంలో ఒక్కోసారి నటీనటుల కాల్షీట్ల లో పేర్కొన్న టైమింగ్స్ దాటిపోతుంటాయి. ఎక్కువమంది నటీనటులతో కాంబినేషన్ సీన్స్ తెరకెక్కించేటపుడు ఇలాంటి చిన్నపాటి సర్దుబాట్లు నటీనటులు చేసుకోక తప్పదు. ఒక రోజు ఎఫ్ 3 షూటింగ్లో తమన్నా కాల్షీట్ల ప్రకారం తన టైం అయిపొయింది. తను సెట్స్ నుండి ఇంటికెళ్లిపోవాలనుకుంటుంది. ఎందుకంటే తెల్లారే జిమ్ కెళ్ళాలంట. కానీ తమన్నా మరికొంతమంది నటీనటులతో షూట్ చెయ్యాల్సి ఉంది. ఈ సంఘటన అనిల్, తమన్నా ల మధ్య మనస్పర్ధలు తలెత్తెలే చేసిందని తెలుస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమన్నా ప్రమోషన్స్ లో పాల్గొని ఉండకపోవచ్చు. కానీ అనిల్ మాత్రం తమన్నా ప్రమోషన్స్ లో ఎందుకు పాల్గొనలేదని అడిగితే, ఆమెకున్న వరస షూటింగ్ కమిట్మెంట్స్ వల్ల ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయిందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa