టాలీవుడ్, కోలీవుడ్లలో స్టార్ హీరోయిన్ గా దశాబ్దకాలం పాటు అజమాయిషీ చెలాయించిన సమంత, బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ఉత్తరాదిన మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత పుష్ప లో ఐటెం సాంగ్ తో స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఈ క్రమంలో డైరెక్ట్ హిందీ మూవీలో నటించి, బాలీవుడ్ లో పాగా వెయ్యాలనుకుంటుంది. కొన్ని కధలు చర్చల దశలో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నా అలాంటిదేమి లేదని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో సమంత, స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో క్లోజ్ గా దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎవర్ స్వీటెస్ట్ రణ్ వీర్ అని ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. సెట్ లో దిగిన ఫోటో కావడంతో అందరూ వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే నిజమేంటంటే, వీరిద్దరూ కలిసి ఒక ప్రచార కార్యక్రమంలో కలిసి నటించారు. ఆ యాడ్ షూట్ లొకేషన్లో సరదాగా దిగిన ఫోటోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ముంబైలో ఈ యాడ్ షూట్ జరుగుతుంది. సమంత పోస్ట్ కు చాలా సంతోషం అని రణ్ వీర్ రిప్లై ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa