గతకొన్నాళ్ళుగా సరైన హిట్ లేక ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వెంకిమామ, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల తర్వాత రాశి నుండి సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోతుంది. అయితే ఆమె నటించిన రెండు తెలుగు సినిమాలు కొద్దివారాల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో ఒకటి గోపీచంద్ తో నటించిన పక్కా కమర్షియల్, రెండవది నాగచైతన్య తో నటించిన థాంక్యూ. ఈ సినిమాల తర్వాత రాశిఖన్నా మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
కృష్ణ చైతన్య డైరెక్షన్లో ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. ఇందులో హీరోయిన్గా రాశీఖన్నాకు ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా. పీపుల్ మీడియా బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ మూవీ.