మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. తాజాగా ఆయన డైరెక్ట్ చేసిన కొత్త చిత్రం అంటే సుందరానికి. ఇందులో నాచురల్ స్టార్ నాని, నజ్రియా నాజిమ్ జంటగా నటించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం జూన్ 10వ తేదీన విడుదలకానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రమోషన్స్ లో మునిగిపోయింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో డైరెక్టర్ వివేక్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంటే సుందరానికి మూవీ స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుందని, ఇదేదో కనీవినీ ఎరుగని కథ కాదని చెప్పారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఉండే ఎమోషన్స్ అందరికి తెలిసినవే అని, కాకపోతే తన స్టైల్ లో ఈ సున్నితమైన ప్రేమకథను ఫన్నీ వే లో చూపించానని చెప్పారు. తను చేసిన ఈ ప్రయత్నం అందరికీ తప్పక నచ్చుతుందని వివేక్ నమ్మకం గా ఉన్నారు.
యంగ్ హీరో నాగశౌర్య చేస్తున్న కృష్ణ వ్రింద విహారి, అంటే సుందరానికి ఒకటే అనే కామెంట్స్ పై కూడా వివేక్ ఆత్రేయ స్పందించాడు. ఈ రెండు సినిమాల్లో హీరో పాత్రలు ఒకటే. ఇద్దరూ బ్రాహ్మణ యువకుడి పాత్రల్లోనే నటించారు. అంతకుమించి ఈ రెండు సినిమాల మధ్య సారూప్యం లేదని తెలిపారు.