నాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ జంటగా నటించిన చిత్రం 'అంటే సుందరానికి'. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.