మిస్ వరల్ కిరీటం తెచిపెట్టిన ఆరో భారత అందం మానుషి చిల్లర్. 'పృధ్వీరాజ్' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన పృధ్వీరాజ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రాణి సంయోగితగా మానుషి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ ఆనందంలో జ్యూవలరీ షూట్ ఒకటి చేసింది మానుషి. ఎల్లో కలర్ డ్రెస్ లో మెడలో డైమండ్ నెక్లెస్ తో సన్ ఫ్లవర్ లా మెరిసింది. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆమె నాజుకైన అందాలకు నెటిజన్స్ లైకులు కొడుతున్నారు. ఇక చిల్లర్ నటిస్తున్న రెండో సినిమా 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉంది.