ట్రెండింగ్
Epaper    English    தமிழ்

USA బాక్సాఫీస్ వద్ద సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టిస్తున్న 'మేజర్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 01:38 PM

శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన "మేజర్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, మేజర్ సినిమా USAలో $900K వసూలు చేసి 1 మిలియన్ దిశగా వెళ్తుంది. ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. "మేజర్" చిత్రం భారతదేశంలోని ముంబైలో 26-11 మధ్య జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa