ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ NBK#107 పై క్రేజీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 09:51 PM

గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 107వది కావడంతో NBK #107గా పిలవబడుతుంది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీ లో వరలక్ష్మి  శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రాక్, అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ గోపీచంద్ , బాలయ్యల నుండి రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నుండి విడుదలైన పవర్ఫుల్ పోస్టర్లు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే ఉండటంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 10వ తేదీన బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఈ అప్డేట్ ఏంటన్న దానిపై పలురకాల రూమర్స్ విన్పిస్తున్నాయి, అందులో ఇంటరెస్టింగ్ కలిగిస్తున్న వార్త ఏంటంటే, 35 సెకండ్ల పాటు సాగే, అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ తో కూడిన టీజర్ అనే టాక్ వైరల్ అవుతుంది. ఈ వార్త నిజమోకాదో తెలియాలంటే జూన్ 10 వరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa