ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్రిగుణ్ హీరోగా "కిరాయి" ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 10:12 PM

24 కిస్సెస్, డియర్ మేఘా సినిమాలతో యువతను ఆకర్షించిన హీరో అరుణ్ అదిత్ అలియాస్ త్రిగుణ్. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం కిరాయి. త్రిగుణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ను డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసారు. ఇంటెన్స్ ఎమోషన్ తో త్రిగుణ్ లుక్ ఆకట్టుకుంటుంది. రక్తంతో పూర్తిగా తడిసిన షర్టు, దానికి వేలాడుతున్న సంకెళ్లు, సిగరెట్ కాలుస్తున్న త్రిగుణ్ లుక్ సినిమాపై ఇంటరెస్ట్ కలిగిస్తుంది. ఈ సినిమాకు VRK డైరెక్టర్. గుంటూరు, పల్నాడు ప్రాంతాలలో 1995 నుండి 2000 వరకు హల్చల్ చేసిన కిరాయి రౌడీల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ సినిమాను అమూల్య రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీనుండి ఇకపై అప్డేట్లు వస్తూ ఉంటాయని మేకర్స్ తెలిపారు. త్రిగుణ్ నుండి రావడానికి కొండా సినిమా రెడీగా ఉంది. రాంగోపాల్ వర్మ డైరెక్షన్లో, తెలంగాణా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొండా మురళి బయోపిక్ గా రానున్న ఈ చిత్రంలో త్రిగుణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa