బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ బెర్లిన్ వీధుల్లో షికారు చేస్తోంది. అందమైన లొకేషన్స్ మధ్య ఫోటోలు తీయించుకొని.. వాటిని అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. వరుణ్ ధావన్ కి జంటగా జాన్వీ నటిస్తున్న సినిమా బవాల్'. ఈ సినిమా తాజా షెడ్యూల్ బెర్లిన్ లో జరుగుతుంది. అయితే షూటింగ్ గ్యాప్ లో వరుణ్ ధావన్ తో కలిసి జాన్వీ బెర్లిన్ వీధుల్లో చక్కర్లు కొడుతుంది. స్లిట్ ఫిట్ పూల డ్రెస్ లో జాన్వీ స్పెషల్ గా |కనిపిస్తుంది. ప్రస్తుతం జాన్వీ బవాల్ సినిమాతో పాటుగా గుడ్ లక్ జెర్రీ, మిలి సినిమాల్లో నటిస్తోంది.