బ్యాచిలర్ బ్యూటీ దివ్య భారతి సడన్ సప్రైజ్ ఇచ్చింది. ఎక్కువగా ట్రెండీ లుక్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ చీరలో మెరిసింది. యెల్లో కలర్ సారీలో పద్దతిగా ముస్తాబైంది. ఈసారి కెమెరా ముందు వంకర్లు తిరగలేదు. పెళ్లి చూపులు జరుపుకుంటున్న పెళ్లి కూతురిలా పద్దతిగా కూరొంది. చీర కట్టులో దివ్య భారతి అందానికి ఆమె అభి మానులు ఫిదా అవుతున్నారు. 'బ్యాచిలర్' సినిమాలో జీవీ ప్రకాష్ కి జంటగా నటించింది దివ్య భారతి. ఇందులో అభినయం కంటే ఆమె అందానికే ఎక్కువ మార్కులు పడ్డాయి. మరిన్ని సినిమా ఆఫర్ల కోసం ఈ ముద్దుగుమ్మ గట్టిగానే ప్రయ త్నిస్తోంది.