జూన్ 10వ తేదీన నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయన నటిస్తున్న కొత్త చిత్రం NBK 107 చిత్రబృందం ఫస్ట్ హంట్ పేరిట నిన్న సాయంత్రం ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోకు ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన వస్తుంది. యూట్యూబులో ట్రెండింగ్ వీడియోస్ లో నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే, ఈ రోజు తాజాగా NBK107 చిత్రబృందం బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. గుడిలో నుండి బయటకు వచ్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించే ఉత్సవమూర్తిలా బాలయ్య ప్రజలకు అభివాదం చేస్తున్నట్టు ఉంది. చేతికి రక్షాబంధనాలు, జపమాలతో మాసిజానికి బాలయ్య కొత్త స్టైల్ ను తీసుకొచ్చారు.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తన కలల ప్రాజెక్టుగా ఎంతో అపురూపంగా తీర్చిదిద్దుతున్నారు. ఒక అభిమాని బాలయ్య బాబును ఎలా ఐతే చూడాలనుకుంటున్నాడో NBK 107టీజర్ వీడియోలో అలా చూపించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో శృతి హాసన్ కధానాయిక కాగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.